English   

ఈ వారం నాలుగు సినిమాలు...ఏమయ్యేనో ?

friday
2019-07-07 11:58:00

శుక్రవారం వచ్చిందంటే తెలుగు సినిమా అభిమానులకి పండగే, ఎందుకంటే ఆరోజునే సినిమా వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసేది. ఇక ఈ వారం కూడా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నిజానికి ఓకే రోజున రెండు సినిమాలు రిలీజ్ అయితేనే ఇబ్బంది, అలాంటిది ఇన్ని సినిమాలు అంటే బాగున్న సినిమా వారికి తప్ప మిగతా అందరికీ ఇబ్బందే. గత కొద్ది రోజుల నుండి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. మొదటగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు రాజశేఖర్ రెండో అమ్మాయి శివాత్మికలను జంటగా పరిచయం చేస్తూ రూపొందిన దొరసాని మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక మరోపక్క సందీప్ కిషన్ హీరోగా ఆయనే నిర్మించిన రూపొందిన హారర్ థ్రిల్లర్ మూవీ నిను వీడని నీడను నేనే మొదటి నుండి అంచనాలు లేకున్నా ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక మరోపక్క శ్రీహరి వారసుడు మేఘంష్ హీరోగా రూపొందిన రాజ్ దూత్ కూడా అదే తేదీన రిలీజ్ అవుతోంది. నిజానికి 5నే ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ ఏవో కారణాల వల్ల వారం వాయిదా వేసుకున్నారు. ఇంకో పక్క తెలుగు టెంపర్ ని తమిళ్ లో అయోగ్యగా విశాల్ హీరోగా రిలీజ్ చేయగా ఆ సినిమాని కూడా అదే తేదీన మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇంకో పక్క హృతిక్ రోషన్ సూపర్ 30 కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. మరి వీటిలో ఏ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంటుందో వేచి చూడాలి.

More Related Stories