English   

తమ్ముడు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు....కన్నీళ్లు పెట్టుకున్న విజయ్

 Vijay devarakonda
2019-07-08 09:37:27

తమ్ముడు సినిమాల్లోకి రావడం నాకు ఇష్టం లేదని సంచలన కామెంట్స్ చేశారు విజయ్ దేవరకొండ. శివాత్మిక రాజశేఖర్, ఆనంద్ దేవకొండ హీరో హీరోయిన్లుగా లాంచ్ అవుతున్న దొరసాని సినిమా జూలై 12న విడుదల కానుండటంతో హైదరాబాద్‌ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిన్న సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆనంద్ కోసం విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకాగా శివాత్మిక కోసం జీవిత, రాజశేఖర్ తదితరులు ముఖ్య అతిధులుగా వచ్చారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమ్ముడు ఆనంద్ దేవరకొండను ఉద్దేశించి ఆసక్తికరంగా మాట్లాడాడు విజయ్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ సినిమా చేస్తాన్నప్పటినుండి అతనితో పెద్దగా మాట్లాడలేదని, ఈరోజు మాట్లాడాలని అన్నారు. తాను పుట్టపర్తి హాస్టల్‌లో ఉండి చదువుకునే టైంలో క్లాస్‌లు తొందరగా స్టార్ట్ అయ్యాయని, తన క్లాస్ కాకున్నా ఏడ్చుకుంటూ నా క్లాస్ రూం దగ్గరకు వచ్చేసేవాడని అప్పటి నుండే వీడికి నేను ఎక్కడికి వెళ్తే అక్కడకు వచ్చేయడం అలవాటయిపోయిందని అన్నాడు. కష్టపడి ఇంజనీరింగ్ చేసి యూఎస్‌లో జాబ్ మానేసి ఇండియాకి వచ్చేస్తా అంటే నాకు నచ్చలేదని, ఇప్పుడు ఎందుకురా? ఇక్కడకి వచ్చి ఇక్కడ ఏం చేస్తావ్ అని అడిగితే యాక్టింగ్ చేస్తానన్నాడని చెప్పుకొచ్చాడు. యాక్టింగ్ అంటే ఆటలు కాదు..వచ్చేసి సడెన్ గా నటిస్తా అంటే అంత ఈజీ కాదని చెప్పానని చెప్పుకొచ్చాడు. కాని గట్టిగా ఫిక్స్ అయ్యాడని అర్ధం అయ్యి  సరే వచ్చి నీ సినిమా నువ్ చేసుకో. నా దగ్గరకు నువ్ రాకు నన్ను ఏం అడగద్దని, ఎలాంటి సపోర్ట్ చేయనని చెప్పేశానని అప్పటి నుండి ఇప్పటి వరకూ వాడి సినిమా గురించి నేను మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు. నేను ఎలాగైతే సినిమాని సెలెక్ట్ చేసుకున్నానో అలాగే తమ్ముడు కూడా అలాగే చేయాలని అనుకున్నానని అందుకే వాడ్ని అలా వదిలేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాక తను స్ట్రగుల్ అవుతున్న సమయంలో యూఎస్‌ లో జాబ్ చేస్తూ ఇంటికి డబ్బు పంపించి హెల్ప్ చేశావని, ఆ టైంలో హెల్ప్ చేసినా నీకు హెల్ప్ చేయలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. 

More Related Stories