యాంకర్ అనసూయకు కోపం వచ్చింది.. వాళ్లందర్నీ బ్లాక్ చేసింది..

సెలబ్రిటీలు కూడా మనుషులే. వాళ్లకు కూడా మనోభావాలు ఉంటాయి. ఏదైనా ఓ మాట అన్నపుడు ఎందుకు అన్నారు అని ఆలోచించుకోవాలి.. అంతే కానీ ఇష్టమొచ్చినట్లు వాళ్లను ట్రోల్ చేస్తూ కూర్చుంటాం.. దొరికారు కదా అని వాళ్లతోనే ఆడుకుంటాం అంటే సరిపోదు. ఇప్పుడు యాంకర్ అనసూయ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కొందరు వ్యక్తులు తనను కావాలనే సోషల్ మీడియాలో సతాయిస్తున్నారని.. తాను చెప్పాలనుకుంటున్నది మానేసి ఎవరికి నచ్చినట్లు వాళ్లు తనతో ఆడుకుంటున్నారని వాపోతుంది ఈ ముద్దుగుమ్మ. తాను చెప్పాలనుకున్నది మానేసి.. తమకు నచ్చినట్లు మాట్లాడేసుకుని చివరికి తాను మాట్లాడిందే తప్పు అంటున్నారని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.
దాంతో రంగమ్మత్త ఇప్పుడు బాగా సీరియస్ గా ఉంది. కొందరు సోషల్ మీడియాలో తనపై కావాలనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అందుకే వాళ్లందర్నీ ట్విట్టర్లో బ్లాక్ చేస్తున్నానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. దీనిపై స్పందిస్తూ.. తన ట్విట్టర్ పేజీలో పిచ్చి వాగుడుకు తావు లేదని.. అందుకే అలా మాట్లాడే వాళ్లను తీసేస్తున్నానంటూ ట్వీట్ చేసింది. వాళ్లను బ్లాక్ చేస్తే కానీ తనకు మనశ్శాంతిగా ఉండదని చెబుతుంది ఈ భామ. పైగా ఇది తన అకౌంట్.. ఇందులో తాను ప్రశాంతంగా ఉండటానికి ఏది కావాలనుకుంటే అది చేసే హక్కు తనకు ఉందని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సినిమా విషయంలో ఈమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.