మిలిటరీ ఆఫీసర్ గా మహేష్ లుక్...అదరకొట్టాడుగా !

సూపర్‌స్టార్ మహేశ్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ నిన్నే కశ్మీరులో మొదలైంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి, అందుకు తగ్గట్టే పోస్టర్ లో కూడా గన్ క్యాప్ లతో చిన్న క్లూ కూడా ఇచ్చారు. దీన్తి ఇప్పటి దాకా మహేష్ ని పోలీస్ పాత్రల్లో తప్ప మిలిటరీ పాత్రలో చూడని వారు ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో ? అని టెన్షన్ పడ్డారు. వారి టెన్షన్ క్లియర్ చేస్తూ మిలిటరీ డ్రెస్ లో ఉన్న మహేష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది అఫీషియల్ లుక్ కాదు, లీక్డ్ పిక్, ఆర్మీ బట్టల్లో మహేశ్, రాజేంద్ర ప్రసాద్ ఉన్నఈ ఫోటో ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది. మహేష్ సరసన రష్మిక నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి రీఎంట్రీ ఇస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ కాశ్మీర్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ ఉండనుంది. ఈ షెడ్యూల్ కోసం ఓ స్పెషల్ ట్రైన్ సెట్ ని కూడా అన్నపూర్ణ సెవెన్ యాకర్స్ లో రెడీ చేస్తున్నారు.