కొత్త బాద్యతలు చేపట్టనున్న అనసూయ...

న్యూస్ ప్రజెంటర్ గా తన కెరియర్ ని మొదలు పెట్టిన అనసూయ అ తర్వాత చిన్న చిన్న షో లకు యాంకర్ గా పనిచేసింది ఆమె. అ తర్వాత జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అలా యాంకర్ గా బుల్లితెర మీద రాజ్యం ఏలి నెమ్మదిగా వెండితెర మీదకి వెళ్లి అక్కడ కూడా తనదైన మార్క్ వేసుకుంది రంగమ్మత్త అదేనండీ అనసూయ భరద్వాజ్. క్షణం సినిమాతో వెండి తెర మీద ప్రవేశం చేసిన ఆమె రంగస్థలం సినిమాతో నటిగా తన పేరు సుస్థిరం చేసుకుంది. అయితే ఆమె మళ్ళీ కొత్త బాద్యతలు చేపట్టబోతుందని అంటున్నారు. త్వరలో ఆమె నిర్మాతగా కూడా మారనుందని అంటున్నారు. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించలేదు కానీ అమెరికాలో తానా సభలకి వెళ్లి అక్కడ తన సన్నిహితులతో ఆఫ్ ది రికార్డ్ గా చెప్పిన ఈ విషయం బయటకి వచ్చింది. త్వరలోనే అనసూయ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేయనున్న అనసూయ అందులో మొదటి ప్రయత్నంగా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నటిగా కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తున్న అనసూయ నిర్మాతగా మారినా అలానే కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తుందని అనుకుంటున్నారు. చూడాలి మరి ఇందులో నిజం ఎంతో ?