English   

విజ‌య‌నిర్మ‌ల మొద‌టి భ‌ర్త వివ‌రాలు తెలుసా.. ఇక్క‌డ చూడండి..

vijaya
2019-07-08 18:42:05

విజ‌య‌నిర్మ‌ల గారు పోయి వారం రోజులు దాటేసినా కూడా ఇప్ప‌టికీ ఆమె గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆమె జీవితం గురించి.. సినిమాల గురించి చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. తెలుగు ఇండ‌స్ట్రీపై ఆమె వేసిన ముద్ర అలాంటిది మ‌రి. ఇప్పుడు కూడా విజ‌య‌నిర్మ‌ల భ‌ర్త గురించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతుంది. ఇంత‌కీ ఈమె భ‌ర్త ఎవ‌రు అంటే కృష్ణ అని వెంట‌నే చెప్తారు. అస‌లు దీనికి ఆలోచ‌న ఎందుకు అంటారు కూడా. అయితే ఈ త‌రానికి తెలియ‌కుండా మొద‌టి భ‌ర్త కూడా ఉన్నాడ‌నే సంగతి తెలిసిందే. ఆయ‌న గురించి ఎప్పుడు ఎక్క‌డ మాట్లాడ‌లేదు విజ‌య‌నిర్మ‌ల‌. అయితే ఆమె సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో.. అంటే దాదాపు 50 ఏళ్ల కింద ఓ ఇంట‌ర్వ్యూలో మొద‌టి భ‌ర్త గురించి చెప్పింది. విజయనిర్మల మొదటి భర్త ఇంజ‌నీర్. షిప్ నమూనాలు తయారు చేసే కంపెనీలో ఆయ‌న ఉద్యోగం చేసేవారు.
వాళ్ల సంతాన‌మే సీనియ‌ర్ హీరో న‌రేష్. ఆయ‌న‌కు మూడేళ్లు ఉన్న‌పుడు ఈ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది విజ‌య‌నిర్మల‌. అందులోనే త‌న భ‌ర్త వివ‌రాలు చెప్పింది. రంగులరాట్నం సినిమాలో  ఎంపికైన సంద‌ర్భంలో ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఇది. అప్పుడు ఆయ‌న ప్రోత్సాహం వ‌ల్లే న‌టిని అయ్యాన‌ని.. ఆయ‌న వ‌ద్ద‌ని ఉంటే త‌న జీవితం ఎలా ఉండేదో అని చెప్పింది విజ‌య‌నిర్మ‌ల‌. భ‌ర్త చెప్ప‌డంతోనే తాను భార్గవీనిలయంలో న‌టించాన‌ని చెప్పారు ఈమె. భర్త స్నేహితుడి వ‌ల్లే విజయనిర్మల ఫొటోలు సినిమాటోగ్ర‌ఫ‌ర్ విన్సెంట్ కు చేరాయని.. ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చాన‌ని ఆ ఇంట‌ర్వ్యూలో చెప్పారు విజ‌య‌నిర్మ‌ల‌. త‌ను న‌టించిన భార్గవీనిలయం చూసిన త‌ర్వాతే రంగులరాట్నం, ఎంగవీట్టు పెణ్ సినిమాల్లోనూ ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని అప్ప‌ట్లో ఆమె చెప్పుకొచ్చారు.

More Related Stories