English   

సుధీర్ ను పెళ్లి చేసుకున్న సీరియల్ నటి

actress
2019-07-08 19:34:21

సుధీర్ అంటే సుడిగాలి సుధీర్ అనుకునేరు, కాస్త ఆగండి ఈయన కొరియోగ్రాఫర్ సుధీర్. తెలుగు సీరియల్ నటి అస్మితకు కొరియోగ్రాఫర్‌ సుధీర్‌ తో వివాహం జరిగింది. అయితే వీరి వివాహాన్ని సన్నిహితుల మధ్యనే జరుపుకోవడంతో నిన్న హైదరాబాద్ లో వీరి రిసెప్షన్ జరిగింది. వారి రిసెప్షన్ కి పలువురు టీవీ నటులు, యాంకర్లు, సినిమా రంగానికి చెందిన వారు కూడా హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆస్మిత కొరియోగ్రాఫర్ సుధీర్ తో ప్రేమలో ఉన్నట్టు చాలా కలం క్రితమే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఆకాశగంగ, సీతామాహలక్ష్మి, మనసు మమత లాంటి సీరియళ్లలో నటించిన ఈమె సీరియళ్లలో మాత్రమే కాకుండా అతిథి, కలెక్టర్‌ గారి భార్య, మధుమాసం లాంటి సినిమాల్లో కూడా నటించారు. ఇక ఈమె గతంలో అమ్మాయిలను వేధిస్తూ రోడ్డుపై వెళ్తున్న వారిని అల్లరి పెడుతున్న ఇద్దరు పోకిరీలను ఫేస్‌బుక్‌ ద్వారా బుక్‌ పట్టించింది. ట్రాఫిక్‌లో మహిళలను వేధిస్తున్న వారి ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి వారికి శిక్ష పడేలాగా చేసింది. బహుశా సోషల్ మీడియాని, షీ టీమ్స్ ని వాడుకున్న మహిళలలో ఈమె ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఈమె ఫిర్యాదు తర్వాతే చాలామంది ధైర్యంగా ముందుకు వచ్చి తమ మీద జరిగిన వేధింపుల విషయాలు బయట పెట్టారు. 

More Related Stories