English   

సందీప్ రెడ్డికి ఊహించని మద్దతు !

Rangoli
2019-07-09 08:17:11

ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉండే బాలీవుడ్ క్వీన్ కంగనా అక్క రంగోలి ఈసారి అనూహ్యంగా, ఆశ్చర్యపరిచే విధంగా, 'కబీర్ సింగ్' దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు మద్దతుగా ఆయన సినిమాను సమర్థిస్తూ ఆ సినిమా మీద విమర్శలు చేస్తున్న వారి మీద ఫైర్ అయింది. అసలు ప్రియురాలిని కొట్టడం, ఆమెతో మోటుగా సరసమాడటం వంటివి అప్పుడెప్పుడో రాజ్ కపూర్ సినిమాలోనే జరిగాయని గుర్తుచేశారు. ఈ మేరకు నిన్న ట్వీట్ చేసిన రంగోలి ‘రాజ్ కపూర్ నటించిన అత్యంత శృంగారభరితమైన, మొరటైన సన్నివేశం ఇది. అసలు సిసలైన బాలీవుడ్ రూపం ఇది. కాబట్టి రాజ్ కపూర్‌ను దిగ్గజంగా పరిగణించే మీరు ఒక దక్షిణాది దర్శకుడి పట్ల ఇలా ప్రవర్తించడం మానండి’ అంటూ పేర్కొంది. అంతేకాదు, రాజ్ కపూర్ ఆ మోటు సరసం వీడియోను ట్వీట్ చేశారు. అలాగే సెలెక్టివ్ గా వివక్ష చూపడం మానాలని అలా చేయడానికి వ్యతిరేకంగా నిలబడాలని రంగోలి చిత్ర పరిశ్రమలోని వ్యక్తులందరినీ కోరారు. ఇక ఆమె ట్వీట్ చేసిన ఆ వీడియోలో నటి నర్గీస్‌ తనను 'జంగ్లీ' అని పిలిచిన నేపధ్యంలో ఆమెను రాజ్ కుమార్ పరుగులెత్తించి చేయి మెలితిప్పి గుండెలకు హత్తుకుంటాడు. చెంపలు చెల్లు చెల్లుమనిపిస్తాడు. ఆ వెంటనే అతను కోపంగా వెళ్తుంటే హీరోయిన్ ఏడుస్తూ అతని కాలు పట్టుకుని ఆపుతుంది. అయితే మన తెలుగు వాళ్ళ నుండే సందీప్ కి సరయిన మద్దతు రాకుండా ఉంటే కంగనా అక్క మద్దతు తెలపడం కాస్త ఆసక్తికరంగా మారింది.

More Related Stories