English   

సెన్సార్ పూర్తి చేసుకున్న దొరసాని

Dorasani
2019-07-09 08:54:57

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న సినిమా ‘దొరసాని’. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్ల మీద మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. నూతన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలంగాణలో 80ల కాలంలో గడీల పరిపాలనలో  కాలంలో జరిగిన ఒక నిజజీవిత ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈనెల 12న ‘దొరసాని’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పక్కా తెలంగాణ యాసలో పక్కా తెలంగాణా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ వచ్చి ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు రేపింది. నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ టీమ్ ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ప్రకటించింది సినిమా యూనిట్. ఇక ఆరోజున నాలుగు సినిమాలు ఉండడంతో ఏ సినిమా రేసులో ముందుంటుంది అనేది తేలాల్సి ఉంది.  

More Related Stories