English   

నాని - విక్రమ్ కుమార్ సినిమా ఆగిందా ?

Nani Vikram
2019-07-09 09:10:45

నేచుర‌ల్ స్టార్ నాని మొన్ననే జెర్సీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆయన కొత్త సినిమాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడ‌ర్ అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ దొంగలుగా నటిస్తుండగా ఆయన ఆ దొంగల గ్యాంగ్ కి లీడర్ గా నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్ మీద నిర్మితం అవుతున్న ఈ సినిమా ఆగష్టు 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుందని అప్పట్లోనే ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికి ఈ సినిమా రావడం కష్టమే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. దానికి కారణం ఈ సినిమా షూట్ ఆగడమే అని అంటున్నారు. దేనికి అంటే విక్రమ్‌ కుమార్‌ బడ్జెట్‌ లో సినిమా తీయడంలో ఫెయిల్‌ అవుతుంటాడని మొదటి నుంచి కంప్లయింట్‌ ఉంది. ఈ సారి కూడా 'గ్యాంగ్‌ లీడర్‌'కు క్వాలిటీ పేరుతో షెడ్యూల్‌ కంటే నెమ్మదిగా షూట్‌ చేస్తుండడంతో బడ్జెట్‌ లిమిట్‌ దాటిపోతోందట. ఇక ఇప్పటికే నాని మార్కెట్ డల్ అయింది. జెర్సీ సినిమా మంచి పోఎరు తెచ్చుకున్నా కలెక్షన్లు మాత్రం అంతంతగానే వచ్చాయి. అందుకే ప్రస్తుతానికి ఈ షూట్ ఆపారని అంటున్నారు. బడ్జెట్ మళ్ళీ సెట్ చేసి మొదలు పెడతారు అని అంటున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందో లేదో ?  

More Related Stories