English   

మాస్ మహా రాజాకి మూడో రాణి దొరికేసింది !

 Tanya Hope
2019-07-09 09:43:09

మాస్ మ‌హారాజా అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ర‌వితేజ ఎన్ని సినిమాలు చేసినా ఏవీ కలిసి రావడం లేదు, వచ్చినా అవి హిట్ కొట్టడం లేదు. బెంగాల్ టైగ‌ర్ సినిమా ఫ్లాప్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకొని రాజా ది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రాలు వ‌రుస‌గా చేశాడు. ఇందులో రాజా ది గ్రేట్ సినిమా ఒక్కటే మంచి హిట్ గా నిలిచింది. ఆయన ప్ర‌స్తుతం క్షణం ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కో రాజా అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న‌ ఈ సినిమా మూడో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందట, కానీ ఆమె ఎవరో ఏమిట్తో ఇప్పటి దాకా బయటకు రాలేదు. తాజాగా ఆమె ఎవరో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో మూడో హీరోయిన్‌గా తాన్యా హోప్‌ ఎంపికయ్యారు. ఇది వరకు 'నేను శైలజా, అప్పట్లో ఒకడుండేవాడు, పటేల్‌ సార్‌' వంటి సినిమాల్లో నటించిన ఆమెను ఈ సినిమాలో మూడవ హీరోయిన్ గా తీసుకున్నారట. త్వరలోనే జరగనున్న మూడో షెడ్యూల్ షూటింగ్‌ లో తాన్య కూడా పాల్గొననుందట. ఇక బాబీ సింహా, సత్య, సునీల్, రాంకీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

More Related Stories