హిట్ కోసం తిరుమలేశుడి దర్శనం చేసుకున్న అఖిల్ అక్కినేని..

ఏమైనా కోరికలు ఉంటే కలియుగ వేంకటేశ్వరుడికి చెప్పుకుంటారు భక్తులు. ఆయన అయితేనే అన్నీ సరిగ్గా తీర్చేస్తాడని నమ్మకం. అందుకే గోవిందా గోవిందా అంటూ ప్రేమగా పిలిస్తే ఆయన కనికరించి కోరికలు కరుణిస్తాడని ప్రసిద్ధి. ఇప్పుడు అఖిల్ అక్కినేని కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో హిట్ కొట్టడం అనివార్యం అయిపోయింది. ఇలాంటి సమయంలో ఈయన తన కొత్త సినిమాను మొదలుపెట్టే ముందు తిరమలేశుడి దర్శనం చేసుకున్నాడు. అది కూడా మెట్లు ఎక్కి వేంకటేశ్వరుడి చెంత చేరుకున్నాడు అక్కినేని వారసుడు. తిరుమల వెళ్లడం అనేది ప్రశాంతతకు మారుపేరు.. ఎప్పుడు అక్కడికి వెళ్లినా కూడా మనసు చాలా శాంతంగా ఉంటుందని ట్వీట్ చేసాడు అఖిల్. కొత్త సినిమాకు ముందు ఒక్కసారి ఆయన్ని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది.. సినిమాపై బాగా ఫోకస్ చేయొచ్చు.. గోవిందా గోవిందా అంటూ ట్వీట్ చేసాడు అఖిల్ అక్కినేని. ప్రస్తుతం ఈయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. గీతా ఆర్ట్స్ 2 ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న భాస్కర్, అఖిల్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలిక.