English   

అడివి శేష్ ఎవరు ప్రీ లుక్....ది కరెప్ట్ పోలీస్ ఆఫీసర్

Adivi Sesh
2019-07-09 16:48:03

కెరీర్ ఆరంభం నుండి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటూ ఎటువంటి నెగటివ్ ప్రచారం జరగని హీరోలకి అడివి శేష్ ఒకరు. నటనతో పాటు స్క్రీన్ ప్లే రైటర్ గానే కాక, దర్శకుడిగా కూడా పట్టున్న ఈయన గూఢచారి సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్నా స్పీడ్ గా సినిమాలు చేయకుండా మెల్లగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ప్రస్తుతం ఎవరు అనే సినిమాని ఎవరికీ చెప్పకుండా షూటింగ్ చేసేసి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కి పంపేశాడు. కొన్నాళ్లుగా ఈ చిత్రాన్ని గురించి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చిత్రీకరణ జరిపామని, చిత్రంలోని ట్విస్ట్‌లు బయటికి తెలియకుండా ఉండటానికి ఈ విధంగా సీక్రెట్ గా షూట్ చేసినట్టు శేష్ ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. సినిమా రిలీజ్ విడుదల సమయంలో సినిమా హడావుడి ఉండాలే కాని సినిమా ప్రారంభం అయినప్పటి నుండే అక్కర్లేదనేది తన అభిప్రాయమని చెప్పుకొచ్చాడు. ఆగస్టు 23న విడుదల చేయనున్న ఎవరు సినిమాని రామ్ జీ దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. రెజీనా హీరోయిన్ గా నటించగా అడవి శేషు తో పాటు కీలక పాత్రలో నవీన్ చంద్ర ఈ చిత్రంలో నటించాడు. ఇక ఈ సినిమా ప్రీ లుక్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఒక కరప్ట్ అయిన పోలీసు అధికారి పాత్రలో నటించనున్నాడు శేష్. ఇక శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాకి అబ్బూరి రవి డైలాగ్ లు అందించగా వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.  

More Related Stories