English   

డియర్ కామ్రేడ్ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ క‌న్ఫ‌ర్మ్.. విజ‌య్ వ‌చ్చేదెప్పుడంటే.. 

Vijay Deverakonda
2019-07-09 17:14:39

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్ గురించి ఇప్పుడు కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న సినిమా వ‌చ్చిందంటే చాలు బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోతుంది. ఇప్పుడు ఈయ‌న డియ‌ర్ కామ్రేడ్ కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు. ఇక ఈయ‌న సినిమాను కొన‌డానికి బ‌య్య‌ర్లు కూడా పోటీ ప‌డుతున్నారు. డియ‌ర్ కామ్రేడ్ టీజ‌ర్ ఇప్ప‌టికే సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. జులై 11 ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. భ‌ర‌త్ క‌మ్మ దీనిఇక ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర బిజినెస్ కూడా అదిరిపోతుంది. విజ‌య్ సినిమాను ఒక‌ప్పుడు 15 కోట్లకు అమ్మితే వామ్మో అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఈయ‌న కూడా 40 కోట్ల క్ల‌బ్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తున్న డియ‌ర్ కామ్రేడ్ సినిమా బిజినెస్ చూసి అంతా షాక్ అవుతున్నారు. గ‌తేడాది గీత గోవిందం ఏకంగా 70 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి విజ‌య్ రేంజ్ ఏంటో చూపించింది. ఆర్నెళ్ళు బాక్సుల్లో ఉండి విడుద‌లైన టాక్సీవాలా కూడా 24 కోట్లు వ‌సూలు చేసి నిర్మాత‌ల‌కు లాభాల పంట పండించింది. 

ఇక ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ బిజినెస్‌కు రెక్క‌లొచ్చేస్తున్నాయి. డియ‌ర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 40 కోట్లు జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుద‌ల అవుతుంది. దాంతో బిజినెస్ మ‌రింత‌గా పెరిగింది. ఒక్క తెలుగు వ‌ర్ష‌న్ మాత్ర‌మే దాదాపు 30 కోట్ల వ‌ర‌కు అమ్మేస్తున్నారు. ఇక తెలంగాణ‌లో విజ‌య్ ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమాను 7.5 కోట్లకు హ‌క్కులు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. విజ‌య్ గీత గోవిందం సినిమా ఇక్క‌డ 20 కోట్లు వ‌సూలు చేసింది. ఇక సీడెడ్ 3.5 కోట్లు.. ఆంధ్రా ఏరియాలో 10 కోట్లు.. త‌మిళ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ క‌లిపి మ‌రో 7 కోట్ల వ‌ర‌కు అమ్మేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఓవ‌ర్సీస్ కూడా 3 కోట్ల‌కు పైగానే బిజినెస్ జ‌రుగుతుంది. మొత్తంగా అన్ని భాష‌లు క‌లిపి 40 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాడు డియర్ కామ్రేడ్. మొత్తానికి ఇప్పుడు విజ‌య్ హిట్ కొట్టాలంటే చాలా పెద్ద ల‌క్ష్యాన్ని అందుకోవాలి. జులై 26న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

More Related Stories