English   

అందాల‌తో చంపేస్తున్న కృతి క‌ర్బందా.. అయినా కూడా అయ్యో పాపం.. 

Kriti Kharbanda
2019-07-09 17:23:08

కృతిక‌ర్భందా.. ప‌దేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నా ఇప్ప‌టికీ హీరోయిన్ గా నిల‌దొక్కుకోలేక‌పోయింది ఈ భామ‌. అందాల ఆర‌బోత‌కు సిద్ధంగా ఉన్నా.. అక్క‌ పాత్ర‌ల‌కు సెటిలైపోయినా కృతికి అదృష్టం మాత్రం క‌లిసి రావ‌డం లేదు. చివ‌రికి ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ భామ జాత‌కం మార్చ‌లేదు. ఇక ఇప్పుడు కృతి ముందున్న ఏకైక ల‌క్ష్యం అందాల ఆర‌బోత‌. గ్లామ‌ర్ షో లో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు కృతిక‌ర్బందా. ఇప్ప‌టికీ హీరోయిన్ గా వెలిగిపోదామ‌నే ప్ర‌య‌త్నాలు  చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఓ వైపు అక్క పాత్ర‌లు చేస్తూనే మ‌రో వైపు హీరోయిన్ రోల్స్ కోసం కూడా ప్ర‌య‌త్నాలు ఆప‌డం లేదు కృతి క‌ర్బందా. ఆ మ‌ధ్య ఓ హాట్ ఫోటోషూట్ తో తానింకా హీరోయిన్ మెటీరియ‌ల్ నే అంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఓ హింట్ వ‌దిలేసింది కృతి. ఆ త‌ర్వాతే బాలీవుడ్ లో రాజ్ 4 సినిమాలో ఇమ్రాన్ హ‌ష్మీ, గౌర‌వ్ అరోరాల‌తో రొమాన్స్ చేసింది. ఈ సినిమాలో అయితే ఏకంగా హాట్ సీన్స్, లిప్ లాక్స్ తో రెచ్చిపోయింది. అయినా అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు. రాజ్ 4 ఫ్లాప్ తో కృతి జాత‌కం మార‌లేదు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కిణిలా మారిపోయింది కృతిక‌ర్భందా. ఇప్ప‌టికీ అక్క‌డ అవ‌కాశాల కోసం చూస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా ఎక్క‌డ ఏ ఈవెంట్ జ‌రిగినా ఉల్లిపొర కంటే ప‌లుచ‌గా ఉండే దుస్తుల్లో క‌నిపిస్తుంది. ఇక మ‌ధ్య‌లో ఫోటోషూట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. మ‌రి ఈ అందాల ఆకృతిని చూసిన త‌ర్వాతైనా ఎవ‌రైనా ఆఫ‌ర్లు ఇస్తారో లేదో చూడాలి.   

More Related Stories