English   

అఖిల్ తండ్రిగా స్టార్ డైరెక్టర్...కానీ !

Samuthirakani
2019-07-09 17:40:06

చాన్నాళ్ళగా హిట్ కోసం మొహం వాచిపోయేలాగా ఎదురుచూస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ అక్కినేని అఖిల్ లు ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మొన్నీమధ్యనే అట్టహాసంగా ప్రారంభించారు. త్వరలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లనుందని అప్పుడే ప్రకటించారు. గీతా ఆర్ట్-2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయని తాజాగా అందుతున్న సమాచారం. ఈ క్రమంలో కాస్టింగ్ కూడా శరవేగంగా చేస్తున్నారట. ఈ నేపధ్యంలోనే సినిమాలో కీలకమైన ఓ పాత్రకు తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖనిని తీసుకుంటున్నారని ఇన్ సైడ్ సమాచారం. తమిళ సినిమాల ద్వారా సముద్రఖని నటుడిగా మన ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయ్యారు. రఘువారం బీ టేక్ సినిమాలో ధనుష్ తండ్రిగా నటించిన ఈయన తెలుగు వారికి పరిచయమే, ఇక ఆయన తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు. అఖిల్ కు తండ్రిగా సముద్రఖని ఈ సినిమాకి కూడా అంగీకరించారని అంటున్నారు. అయితే ఇదో రెండో సినిమా అయినా మొదట ఇదే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. జక్కన్న ఎప్పటికి చేస్తాడో కదా ! నిజానికి బొమ్మరిల్లు భాస్కర్ తన సినిమాల్లో తండ్రి పాత్రలను బాగా ఎలివేట్ చేస్తారు. ఈ లెక్కన సముద్రాఖనికి తెలుగులో గ్రాండ్ ఎంట్రీ దక్కినట్టే అని చెప్పాలి. ఇక త్వరలోనే దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. అయితే ఈయన విషయం పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories