English   

మళ్ళీ వెనక్కి వెళ్ళిన బెల్ల్లంకొండ బాబు సినిమా !

saisrinivas
2019-07-09 19:26:23

అల్లుడు శ్రీను సినిమా నుండే హిట్టు కోసం ప్రయత్నం చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రైడ్ ఫేం రమేశ్ వర్మ డైరెక్టర్ గా రాక్షసుడు సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఏ స్టూడియోస్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాని హీరో హవీశ్‌ కి చెందిన ప్రొడక్షన్ హౌస్ లో రమేష్ వర్మ దర్శకత్వంలో నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సినిమా రాచ్చసన్ కి తెలుగు రీమేక్ గా తెరెక్కుతున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మితయ్యింది. విష్ణు విశాల్ - అమలా పాల్ జంటగా నటించిన ఆ సినిమా తమిళ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  ఇక ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా ఫ్యాన్సీ రేట్ చెల్లించి మరీ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాని ఆయనే రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తొలుత ఈ నెల 18న రిలీజ్ చేయాలని అనుకున్నా మంచి పోటీ ఉండడంతో మళ్ళీ వెనక్కి తగ్గారు. ఇక ఈ సినిమాని వచ్చే నెల 2వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ ఒక స్పెషల్ పోస్టర్ వదిలారు. అదే రోజు ఇప్పటికే రెండు సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఒకటి శర్వానంద్ రణరంగం కాగా, మరొకటి కార్తికేయ గుణ 3690. దీంతో ఈ సినిమాకి గట్టి పోటీ తప్పదనిపిస్తోంది. పాపం బెల్లంబాబు పరిస్థితి ఏంటో ?

More Related Stories