సుకుమార్ మిత్రోత్సాహం...కుర్రాళ్ళు ఇరగదీస్తున్నారంట !

ఫ్రెండ్ ఎవరికయినా ఫ్రెండే, అది సామాన్యులకి అయినా సెలబ్రిటీలకి అయినా. అదే మామూలు వాళ్ళ స్నేహం మనకి కనిపించదు, సెలబ్రిటీల మీదే కళ్ళుంటాయి కాబట్టి వారు ఏమి చేసిన మనకి వింతగానే ఉంటుంది. ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకు అంటే తాజాగా ‘రాజావారు రాణిగారు’ అనే సినిమా టీజర్ ఒకటి రిలీజ్ అయ్యింది. టీజర్ కాస్త ఆసక్తికరంగానే ఉంది. అయితే అనుకోని విధంగా ఈ సినిమా మీద క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆసక్తి చూపడం. దానికి రీజన్ కూడా ఉందండోయ్ ఈ సినిమాలో ఒక ఊరి ప్రెసిడెంట్ పాత్ర పోషించిన కిట్టయ్య అనే వ్యక్తి మన సుకుమార్ కి చిన్ననాటి స్నేహితుడు అంట. అందుకే ఈ టీజర్ షేర్ చేసిన సుకుమార్ తనదైన శైలిలో రాసుకొచ్చారు.
కుర్రాళ్ళు ఇరగదీస్తున్నారు.
టీజర్ చాలా బాగుంది.
నా మిత్రుడు కిట్టయ్య ఈ చిత్రంలో ప్రెసిడెంట్‌గా నటించారు.
ఆల్ ద బెస్ట్ కిట్టయ్య!
దర్శకుడు రవి కిరణ్ - ఎనర్జీ టీజర్లో అదిరిపోయింది.
మిగతా యూనిట్ అందరికీ కూడా నా అభినందనలు.
ఈ చిత్రం చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అని సుకుమార్ పేర్కొన్నాడు.
ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డి. మనోవికాస్ నిర్మించిన ఈ సినిమా పేరు ‘రాజావారు రాణిగారు’. రవికిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరమ్, రహస్యగోరక్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పక్కా పల్లెటూరి ప్రేమకధగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ అందరికీ నచ్చుతోంది. చాలా కాలం తర్వాత ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ రెడీ అవుతుండడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. చూడాలి మరి మన సుకుమార్ మిత్రోత్సాహం ఎంతవరకూ వెళ్తుందో ?