English   

వామ్మో...బిగ్‌బాస్‌ కి కూడా కమిట్‌మెంట్ ఇవ్వాలా...సంచలనం !

Swetha Reddy
2019-07-10 08:24:55

త్వరలో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానుంది. దానికి ముహూర్తం ఇంకా ఖరారు చేయలేదు కానీ అది ఈనెల 21నే అని విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ సీజన్ కోసం నాగార్జున హోస్ట్ గా రానుండడంతో ఈ షో కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక ఈ షోకి దేశ వ్యాప్తంగా ఈ షోకి ఫుల్ క్రేజ్ ఉండటంతో పాటు తెలుగులో మొదటి రెండు సీజన్స్ రచ్చ రేపడంతో మనవాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ షో మొదలు కానున్న నేపధ్యంలో ఈ షో గురించి సంచనలన ఆరోపణలు చేసింది ఒక యాంకర్. ఆమె పేరు శ్వేతా రెడ్డి, ఈమె ఎవరో అనుకోకండి అప్పట్లో బాలయ్య మీద పోటీ చేస్తానని ప్రకటించి పాల్ పార్టీ తరపున ఒక జర్నలిస్ట్ గుర్తు ఉండే ఉంటుంది కదా, ఆ తర్వాత పాల్ మీద కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఇక తాజాగా ఆమె ఈ షో గురించి సంచలన ఆరోపణలు చేసింది. అదేంటంటే ఈ షోలో పాల్గొనాలి అంటే తనని బిగ్ బాస్ నిర్వాహకులు కమిట్మెంట్ అడిగారని పేర్కొన్నారు. తాను సెలెక్ట్ అయ్యానని చెబితే వారిని రెండు మూడు సార్లు కలిశారు అని, అగ్రిమెంట్ కూడా అయ్యాక శివ అనే ఒక బిగ్ బాస్ కో-ఆర్డినేటర్ మిమ్మల్ని తీసుకుంటే మాకేం లాభం? షో హిట్ అవ్వాలంటే మీరు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? అని అడిగారని ఆమె చెప్పుకొచ్చింది. దానికి సమాధానం చెప్పేలోగా మిమ్మల్ని తీసుకున్నందుకు మా బాస్ కి మీరు ఏ విధంగా ఇంప్రెస్ చేస్తారని అడిగారని తెలిపారు. ఈ ప్రశ్న అడగడంలో మీ ఉద్ధేశమేంటి? నానుంచి ఏం కోరుకుంటున్నారు? బాస్ ను ఇమ్ప్ర్స్ చేయడం అంటే కమిట్ మెంట్ అడుగుతున్నారా? అని ప్రశ్నిస్తే అప్పటి నుండి తన కాల్స్ ఎత్తడం కూడా మానేశారని ఆమె చెప్పుకొచ్చింది.

More Related Stories