English   

పదేళ్ళ తర్వాత ఆ భామతో రొమాన్స్ చేయనున్న నితిన్ 

Nithin
2019-07-10 08:35:04

శ్రీనివాస కళ్యాణం దెబ్బకి ఏడాది గ్యాప్ తీసుకున్న నితిన్, మళ్ళీ ఫాంలోకి వచ్చేసి వరుసగా సినిమాలు ప్రకటించాడు. ప్రకటించడమే కాక వరుసగా సినిమాలు లాంచ్ లు కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెండీ కుడుములతో ఒక సినిమా, చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా, వెంకీ అట్లూరితో మరో సినిమా ప్రకటించారు. అయితే చంద్రశేఖర్ యేలేటితో చేయనున్న సినిమా భవ్య క్రియేషన్స్ బ్యానర్ మీద ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ని కథానాయికలుగా తీసుకున్నారు. మొన్న జరిగిన పూజా కార్యకరమాలలో ప్రియా కూడా పాల్గొంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఇలియానాని కూడా హీరోయిన్ గా అనుకుంటున్నారట. అయితే ముగ్గురు భామలతో ఈయన గారి క్యారెక్టర్ ఏమిటో తెలీదు కానీ, వీరి కాంబినేషన్ గురించే చర్చ జరుగుతోంది. వీరి ఇద్దరూ పరచూరి మురళి డైరెక్షన్లో రెచ్చిపో అనే సినిమా చేశారు, ఇప్పుడు మళ్ళీ కలిసి నటిస్తున్నారు. ఇక ఇలియానా చాలా గ్యాప్ తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేసింది. అది దెబ్బ పడడంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఇక ఆమె మళ్ళీ నితిన్ తో ఈ సినిమా కమిట్ అయ్యిందని అంటున్నారు. ఈ సినిమా అయినా హిట్ కొడితే అప్పుడయినా ఇలియానా టాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ దక్కిన్చుకుంటుందేమో చూడాలి మరి.

More Related Stories