సుధీర్ బాబు బాతిల్ క్యాప్ ఛాలెంజ్...మనోడికి మరోటి ఉందట !

ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో కొత్త ఛాలెంజ్ చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెలబ్రిటీలంతా ఈ ఛాలెంజ్‌తో బిజీగా ఉన్నారు. కాలిని గాల్లోకి లేపి బాటిల్ మూత ఊడేలా తన్నడమే ఈ ఛాలెంజ్. దీన్ని ముందుగా అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ విన్నర్ మ్యాక్స్ హల్లోవే ప్రారంభించగా ప్రముఖ సింగర్ జాన్ మేయర్ దీన్ని ఛాలెంజ్‌గా స్వీకరించాడు. అలా ఈ ఛాలెంజ్ ఒకరి నుండి ఒకరికి ట్రావెల్ అవుతూ ఎట్టకేలకి బాలీవుడ్‌ను కూడా తాకింది. నటుడు అక్షయ కుమార్ కూడా ఈ ఛాలేంజ్‌ను స్వీకరించి రివర్స్ కిక్‌తో బాటిల్ మూతను తెరుస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఎంతోమంది సెలబ్రిటీలు ఛాలెంజ్‌గా తీసుకుని సవాల్ విసురుతున్నారు. తాజాగా ఆ ఫీవర్ మన టాలీవుడ్ ని కూడా తాకింది. హీరో సుధీర్ బాబు ఈ బాటిల్ క్యాప్ ఛాలెంజ్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. తన టీం అడుగుతుందని ఈ బాటిల్ క్యాప్ చాలెంజ్ ఇంత లేట్ గా ఎందుకు చేశారని ? కానీ అది చేసింది వీ సినిమాలోని సుధీర్ బాబు అని ఆయన ఈ వీడియో పోస్ట్ చేశాడు. తను సంబంధించి మరో టాస్క్ ఉందని ఆయన పేర్కొన్నారు.