శ్రీదేవిది మర్డర్...డీజీపీ సంచలనం

నాలుగు భాషలలో పదుల సంఖ్యలో సినిమాలు, రెండు దశాబ్దాల పాటు రాణిలా ఏలిన శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. ఒక పెళ్లి కోసమని దుబాయ్‌కి వెళ్లి అక్కడి హోటల్ లోని బాత్ రూమ్ లో హార్ట్ ఎటాక్ వలన బాత్ టబ్ లో పడి మునిగి శ్రీదేవి మరణించింది. హార్ట్ ఎటాక్ వలనే బాత్ టబ్‌లో పడి మునిగి చనిపోయిందని డాక్టర్లు తేల్చడం, దుబాయ్ పోలీసులు కూడా అదే వివరాలతో కేసు క్లోజ్ చేయడంతో ఆమె మరణంపై అనేక ప్రచారాలు జరిగాయి. బాత్ టబ్‌లో పడి శ్రీదేవి చనిపోలేదని, ఎవరో హత్య చేసారని కొందరు ఆరోపించారు. బాత్ టబ్‌లో పడి శ్రీదేవి చనిపోలేదని, ఆమెపై రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఒమన్ దేశంలో ఉందని, దుబాయ్‌లో మరణిస్తేనే ఆ ఇన్యూరెన్స్ పాలసీని క్లెయిం చేసుకునే అవకాశం ఉందని కూడా అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే వాటిలో ఎలాంటి నిజం ఉందో తెలీదు కానీ అయితే తాజాగా కేరళకి చెందిన జైళ్ళ శాఖ డీజీపీ రిషి రాజ్ సింగ్.. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోలేదని, హత్య చేయబడిందని వ్యాఖ్యానించారు. కేరళకి చెందిన కౌముది అనే పత్రిక ఆయన వ్యాఖ్యలని బ్యానర్ హెడ్డింగ్ తో ప్రచురించడంతో ఇది సంచలనంగా మారింది. తన ఫ్రెండ్, ఫోరెన్సిక్ సర్జన్ డాక్థర్ ఉమాదతన్ శ్రీదేవి మరణం గురించి తనతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారని, ఆయన చెప్పిన కొన్ని కీలక ఆధారాలని బట్టి చూస్తుంటే ఆమెది యాక్సిడెంటల్ డెత్ కానే కాదని, ఆమెను కావాలనే ఎవరో మర్డర్ చేసారని అర్ధమవుతుందని రాజ్‌సింగ్ పేర్కొన్నారు. ఒకే అడుగున్న బాత్‌టబ్ లో పడి చనిపోయే అవకాశమే ఉండదని కావాలనే ఎవరో వెనుక నుండి తోసి చంపేసి ఉంటారని వ్యాఖ్యానించారు. మరి ఈ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఏమని స్పందిస్తారో చూడాలి మరి.