English   

మేజర్ అజయ్ కృష్ణగా మారిన మహేష్ 

 Mahesh Babu
2019-07-10 17:46:22

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 26 వ చిత్రం సరిలేరు నీకెవ్వరు. వరుస హిట్ సినిమాల దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అనీల్ సుంకర - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన కన్నడ కస్తూరి రష్మికా నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కశ్మీర్ లో జరుగుతున్నది. అయితే తన కెరీర్ కో మొదటిసారిగా మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఈ సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. ఈ మధ్యనే మహేష్ మిలటరీ గెటప్ లో ఉన్న పిక్స్ లీకయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యయ్యి. అయితే తాజాగా ఆయన చేసే పాత్ర పేరు కూడా రివీలైంది. అయితే అది లీక్ అవ్వలేదండోయ్, స్వయంగా అనీలే ప్రకటించాడు. ఇక మహేష్ పాత్ర పేరు మేజర్ అజయ్ కృష్ణ. ఆర్మీ అధికారి పాకెట్ పై ఉండే బ్యాడ్జ్ పై అజయ్ కృష్ణ అన్న పేరుతో ఉన్న పిక్ ని అనిల్ షేర్ చేశారు. ‘ఒక్కడు’లో మహేశ్‌ కబడ్డీ ఆటగాడు అజయ్‌గా, ‘దూకుడు’లో ఐపీఎస్‌ అజయ్‌ కుమార్‌గా నటించగా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్‌ అయ్యాయి. అందుకే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా కోసం ఆయన అజయ్‌ కృష్ణగా మారడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

More Related Stories