English   

హాలీవుడ్ సినిమాల్లో ఛాన్స్ పట్టేసిన తమిళ్ నటుడు !

Actor Napoleon
2019-07-10 18:11:11

ప్ర‌ముఖ తమిళ న‌టుడు నెపోలియ‌న్ ద‌క్షిణాది భాష‌ల‌లో దాదాపు వంద‌కి పైగా సినిమాలు చేశారు. అయితే ఆయ‌న తొలిసారి హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ని కలిసి ముచ్చటించారు. ర‌జనీకాంత్ ఇంటికి వెళ్లిన ఆయ‌న‌ రజనీకి శాలువా క‌ప్పి సత్కరించారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన‌ ఎజామాన్ చిత్రంలో విల‌న్ పాత్ర పోషించిన నెపోలియ‌న్ డెవిల్స్ నైట్‌, క్రిస్ట‌మ‌స్ కూప‌న్ అనే రెండు హాలీవుడ్ చిత్రాల‌లో న‌టించే అవ‌కాశం దక్కించుకున్నారు. క్రిస్ట‌మ‌స్ కూప‌న్ చిత్రం డానియ‌ల్ నుడ్సెన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌గా ఇందులో కోర్ట్నే మాథ్యూస్‌, ఆరోన్ నోబుల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో హాకీ ప్లేయ‌ర్ మేనేజ‌ర్ పాత్ర‌లో నెపోలియ‌న్ క‌నిపించ‌నున్నారు. ఇక ఈయన గతంలో మ‌న్మోహ‌న్ క్యాబినేట్‌లో కేంద్ర మంత్రిగా కూడా ప‌ని చేశారు నెపోలియ‌న్‌. ఇక మారిన సమీకరణల నేపధ్యంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక చివ‌రిగా ఆయన సీమ‌రాజా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఇక తమిళ్ నుండి ఇప్పటికే ధనుష్ ఒక హాలీవుడ్ సినిమా చేయగా తమిళ్ ఇండస్ట్రీ నుండి హాలీవుడ్ సినిమా చేస్తున్న రెండో నటుడిగా ఈయన చరిత్ర కెక్కనున్నారు.

More Related Stories