English   

మహేష్ ఎఫెక్ట్....సంక్రాంతికే అంటూ బన్నీ సినిమా ప్రకటన !

 Allu Arjun
2019-07-10 18:28:32

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడం మొదటి రెండు సినిమాలు బంపర్ హిట్స్ కావడం ఈ సినిమా మీద ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ప్రస్తుతం షూట్ లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అనుకోవడమే కానీ దానికి సంబంధించి సరయిన అప్డేట్ లేదు, కానీ ఈరోజు మహేష్ బాబు సినిమా సంక్రాంతికే రిలీజ్ అని అనిల్ రావిపూడి ప్రకటించడంతో ఎందుకైనా మంచిది అనుకుందో ఏమో కానీ ఈ సినిమా యూనిట్ కూడా తమ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లోనే అని ప్రకటించింది, వచ్చే ఏడాది సంక్రాంతికి గట్టి పోటీనే ఉంది, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజినీకాంత్ 166 వ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసుకున్నారు. మరో పక్క ప్రభాస్ కూడా వచ్చే సంక్రాంతికి జాన్ సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. నాగార్జున కూడా బంగార్రాజు సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని నాగ్ అనుకుంటున్నాడు. ఎందుకొచ్చిన తంటా అనుకుంటున్నారో ఏమో కానీ ఇప్పటి నుండే బెర్త్ కన్ఫామ్ చేసుకుంటున్నారు.

More Related Stories