రహస్యంగా పెళ్లి చేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు

టాలీవుడ్ లో మోస్ట్ బిజీయస్ట్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఎన్నో సినిమాలకి సూపర్ హిట్స్ ఇచ్చిన ఈయన ఇంకా పెళ్లి కాలేదు. అయితే దేవిశ్రీ తమ్ముడు సాగర్ కు మాత్రం పెళ్లయిపోయింది. అది కూడా రహస్యంగానే, గత నెల 19న సాగర్ వివాహం జరిగిందని దేవిశ్రీనే స్వయంగా వెల్లడించాడు. మౌనిక అనే డాక్టర్ అమ్మాయితో తమ్ముడి పెళ్లి జరిగిందని ట్వీట్ చేశాడు. అదీ కాక జూన్ 19న తన తల్లిదండ్రుల పెళ్లిరోజు కూడా కావడం విశేషమని డీఎస్పీ తెలిపాడు. ఈ పెళ్లిలో తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరైనట్టు వెల్లడించాడు. పెళ్లిలో తీసిన ఫొటోలను షేర్ చేసిన దేవిశ్రీ ``నా ప్రియమైన తమ్ముడు సాగర్ మోనిక పెళ్లి చేసుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ శుభకార్యంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. అదే రోజున అమ్మానాన్నల పెళ్లిరోజు కావడం విశేషం. మీ జంటలకు అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి`` అని పేర్కొన్నారు. అన్న ప్రోత్సాహంతో గాయకుడైన సాగర్, `రాక్షసుడు` సినిమాతో మాటల రచయితగా కూడా మారారు.