టీమిండియాకు సినిమా వాళ్ల సపోర్ట్.. ఇండస్ట్రీని తాకిన క్రికెట్ ఫీవర్..

ఇండియాలో ఇప్పుడు ఎవర్ని కదిపినా కూడా సెమీస్ ఓటమి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు అద్భుతంగా ఆడుతూ వచ్చిన టీం.. అనుకోకుండా ఒక్కరోజు బోల్తా పడింది. దాంతో ఇంటికి వచ్చేసింది. అయితే ఇండియన్ టీం ఓటమి గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమా వాళ్లు అంతా ఇప్పుడు టీమిండియాకు అండగా ఉన్నారు. ప్రపంచ కప్పులో మన వాళ్లు ఆడిన తీరుకు అంతా ఫిదా అయిపోతున్నారు. సెమీస్ ఓడినా కూడా మనసులు గెలిచారంటూ అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ధోనీ, జడేజా ఆటతీరుపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అంతా ఇప్పుడు క్రికెట్ జపమే చేస్తున్నారు. మన వాళ్లు ఓడినా కూడా మనసులు గెలిచారంటూ బాసటగా నిలుస్తున్నారు. అమీర్ ఖాన్, ఆయుష్మాన్, జాన్ అబ్రహాం లాంటి బాలీవుడ్ హీరోల నుంచి సాయి ధరమ్ తేజ్, సుధీర్ బాబు లాంటి మన తెలుగు హీరోల వరకు అంతా క్రికెట్ ఫీవర్ నడుస్తుంది. ఇండియా ఓటమిపై వాళ్లు కూడా ఎమోషనల్ అయ్యారు. ధోనీ అవుట్ అయిన ఆ క్షణం నా గుండె పగిలిపోయిందంటూ బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హూడా ట్వీట్ చేసాడు. ఈయన మాదిరే అంతా ఇప్పుడు మన టీం ఓటమిపై స్పందిస్తున్నారు. మొత్తానికి ఇండియా ఇంటిముఖం పట్టడంతో వాళ్లపై విమర్శలు చేయడం కాకుండా ప్రశంసల వర్షం కురిపించారు. కావాల్సిన మద్దతును అందిస్తున్నారు.