English   

సమ్మోహనం సినిమా నటుడు కన్నుమూత 

Amit Purohit
2019-07-11 10:58:56

సుధీర్ బాబు, అతిథి రావు హైదరీ హీరో, హీరోయిన్లుగా ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్ట్ చేసిన సినిమా సమ్మోహనం. ఈ సినిమాలో కూడా అతిథి రావు హైదరీ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె మాజీ ప్రియుడిగా, సినిమాలో రీల్ హీరోగా నటించిన అమిత్‌ పురోహిత్‌ కన్నుమూశారు. అయితే ఈ విషయం ఎక్కదా మీడియాలో రాకమునుపే సుధీర్‌బాబు ట్విటర్‌ ద్వారా తెలిపారు. అమిత్‌ హిందీలో 'పంక్‌', 'ఆలాప్‌' వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో 'సమ్మోహనం' చిత్రంలో చేశాడు. అమిత్‌ మృతికి షాక్ గురయ్యానని చెప్పిన సుధీర్‌ బాబు అమిత్‌ పురోహిత్‌ మరణం నన్నెంతో బాధించిందని, సమ్మోహనం సినిమాలో సమీరా మాజీ ప్రియుడిగా నటించిన అతడు చాలా స్నేహంగా ఉండేవారని, టాలెంట్ ఉన్న ఓ మంచి నటుడు మనల్ని విడిచి వెళ్లిపోయారని, అతడి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నాని పోస్ట్‌ చేశాడు సుధీర్‌. ఇదే విషయం మీద స్పందించిన ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని, తాను పనిచేసిన వారిలో అమిత్‌ ఎంతో వినయం, నిబద్ధత, నైపుణ్యం కలిగిన నటుడని, నిన్ను మిస్‌ అవుతున్నానని తర్వాతి సినిమాకు తీసుకోవాలి అనుకున్నా ఇంతలోపే అలా అయ్యిందని పేర్కొన్నారు. అయితే అమిత్‌ ఎలా చనిపోయారో తెలియాల్సి ఉంది.

More Related Stories