English   

ఇస్మార్ట్ హిట్ కొట్టి నా ద‌గ్గ‌రికి రా.. పూరీకి బాల‌య్య బంప‌ర్ ఆఫ‌ర్.. 

Balakrishna
2019-07-11 11:09:18

పూరీ జ‌గ‌న్నాథ్ ఇప్పుడు హిట్ కొట్ట‌డం అనివార్యంగా మారిపోయింది. ఆయ‌న ఎప్పుడెప్పుడు విజ‌యం సాధిస్తాడా అని ఆయ‌న అభిమానులు వేచి చూస్తున్నారు. టెంపర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా కొట్ట‌లేక‌పోయిన పూరీ.. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఆ మ్యాజిక్ రిపీట్ చేయాల‌ని చూస్తున్నాడు. రామ్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా జులై 18న విడుదల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రోమోస్ కూడా అదిరిపోయాయి. ట్రైల‌ర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవ‌డంతో క‌చ్చితంగా ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు పూరీ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రం హిట్టైతేనే మ‌రో ఆఫ‌ర్ పూరీ చెంత‌కు వ‌స్తుంద‌ని తెలుస్తుంది. అదే బాల‌య్య‌తో సినిమా చేసే అవ‌కాశం. గ‌తంలోనే పైసా వ‌సూల్ అంటే బాల‌య్య‌తో ఓ సినిమా చేసాడు ఈయ‌న‌. ఇది ఫ్లాప్ అయినా కూడా అప్పుడు పూరీతో బాండింగ్ కు ప‌డిపోయాడు బాల‌య్య‌. ఆయన టేకింగ్ కు ఫిదా అయిపోయాడు. దాంతో మ‌రోసారి పూరీతో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. అయితే దీనికి ఓ మెలిక కూడా పెట్టాడు. ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ అయితే కానీ బాల‌య్య‌తో సినిమా అవ‌కాశం రాదు. ఇప్పుడు ఈ కండీష‌న్ కు ప‌డిపోయాడు పూరీ. క‌చ్చితంగా ఇస్మార్ట్ హిట్ కొట్టి బాల‌య్య‌తో ఆఫ‌ర్ ప‌ట్టేస్తానంటున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. ప్ర‌స్తుతం కేయ‌స్ ర‌వికుమార్ సినిమాతో బిజీగా ఉన్నాడు పూరీ. మ‌రి చూడాలిక‌.. త‌ర్వాత ఏం జ‌ర‌గ‌బోతుందో..?  
 

More Related Stories