English   

మెగాస్టార్ కోసం ఐష్ ?

Koratala Siva
2019-07-11 11:16:33

మెగాస్టార్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహరెడ్డి. తెలుగు తొలితరం స్వాతంత్ర సమరయోధుడు, ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి కాగా, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఈ నేపధ్యంలో తన తర్వాతి సినిమా మీద ద్రుష్టి పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే కొరటాలతోనే ఆయన సినిమా ఉంటుందని దాదాపు ఖరారు అయినట్టే. కానీ దానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాలో తేసుకుఎ హీరోయిన్ గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో నటించే హీరోయిన్ గా మాజీ ప్రపంచ సుందరిని తీసుకోడమే. నిజానికి ఈ సినిమాలో నయనతార, లేదా కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్ లాంటి వారి పేర్లు వినిపించినా, ఈ సినిమాకి మరింత క్రేజ్ రావాలని కొరటాల ఐశ్వర్యా రాయ్ ని తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. జీన్స్, రోబో వంటి సినిమాలతో ఆమె తెలుగు వారికి పరిచితమే, మరి ఆమె ఈ సినిమాకి ఒప్పుకుంటుందా ? లేదా అనేదే సస్పెన్స్ గా మారింది. 

More Related Stories