డియర్ కామ్రేడ్ ట్రైలర్.. విజయ్ దేవరకొండ మళ్లీ రెచ్చిపోయాడు..

కామ్రేడ్ పోరాటం చేస్తే హాయి, స్వేఛ్చ ఇవ్వాలి. కానీ నిన్ను చూస్తుంటే అదేమీ కనిపించడం లేదు..
చైతన్య నువ్వు చేసే పనులు ఏం బాలేవు.. కోపం తగ్గించుకో..
కాలేజీలో జరిగే గొడవలు మీరు ఆపండి సర్.. లేకపోతే మేం ఆపుతాం..
నన్ను భయపెడుతున్నాం అనుకుంటున్నారేమో.. మీరే భయపడుతున్నారు.. కనిపిస్తుంది..
ఇవన్నీ ఇప్పుడు విడుదలైన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలోని డైలాగులు. ఇవి చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అసలే ఇప్పుడు విజయ్ సినిమాలపై ఇప్పుడు క్రేజ్ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి మరో సాక్ష్యం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం మొదలు పెట్టినప్పుడు ఎవరూ పెద్దగా దీని గురించి పట్టించుకోలేదు. కానీ గీతగోవిందం, టాక్సీవాలా సినిమా సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమాపై కూడా అంచనాలు దారుణంగా పెరిగిపోయాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ దీనిపై మరింత ఆసక్తి పెంచేసింది. కాలేజీ గొడవల నేపథ్యంలో కొత్త దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న డియర్ కామ్రేడ్ జులై 26న విడుదల కానుంది. ట్రైలర్ లో కథ మొత్తం చెప్పేసాడు దర్శకుడు. శివ సినిమా రేంజ్ లో గొడవలను హైలైట్ చేస్తూనే.. మరోవైపు ప్రేమకథ కూడా చూపించాడు భరత్ కమ్మ. ఇక సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషన్స్, ముద్దులు అన్నీ ఉన్నాయి. అర్జున్ రెడ్డిలో అధర చుంబనాలు విషయంలో ఆరితేరిపోయిన విజయ్ దేవరకొండ గీతగోవిందంలో కూడా ఒకసారి కిస్ చేసాడు. ఇక ఇప్పుడు కూడా రష్మిక మందన్నతో అదే పనిలో ఉన్నాడు ఈయన. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ సారి కూడా విజయ్ బాగా గట్టిగా బాక్సాఫీస్ దగ్గర కొట్టేలా కనిపిస్తున్నాడు. పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసి భరత్ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.