English   

నిర్మాత‌గా స‌మంత అక్కినేని.. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఆ సినిమా.. 

Samantha
2019-07-11 12:53:51

పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత వ‌ర‌స సినిమాలు చేస్తూనే ఉంది. ఈమె కోసం ఇప్ప‌టికీ క‌థ‌లు సిద్ధం చేస్తూనే ఉన్నారు ద‌ర్శ‌కులు. ఒప్పుకుంటే స్టార్ హీరోలు కూడా రొమాన్స్ కు రెడీ అంటున్నారు. ఇప్పుడు ఓ బేబీ కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. యూ ట‌ర్న్ సినిమాతో ప్రశంస‌ల ద‌గ్గ‌రే ఆగిపోయిన స‌మంత‌.. ఇప్పుడు పైస‌లు కూడా తీసుకొస్తుంది. దాంతో గాల్లో తేలిపోతుంది స్యామ్. ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణయం తీసుకోడానికి సిద్ధ‌మైపోయింది స‌మంత‌. ఇన్నాళ్లూ కేవ‌లం న‌టిగానే స‌త్తా చూపిస్తూ వ‌చ్చిన ఈమె ఇప్పుడు నిర్మాత‌గా కూడా మారిపోతుంద‌ని తెలుస్తుంది. ఇదే ఇప్పుడు ఆస‌క్తి పుట్టిస్తున్న విష‌యం. ఓ బేబీ బాగానే ఉండ‌టంతో నందిని రెడ్డితో మ‌రో సినిమా చేయ‌డానికి క‌మిట్ అవుతుంది స‌మంత అక్కినేని. ఆ సినిమా జ‌రుగుతున్న‌పుడే త‌న‌తో మ‌రో సినిమా చేయాల్సిందిగా స‌మంత‌తో నందిని అగ్రీమెంట్ తీసుకుంద‌ని తెలుస్తుంది. అయితే ఓ బేబీ హిట్ అయితే కానీ మ‌రో ఆఫ‌ర్ ఇవ్వ‌న‌ని స‌మంత ముందే చెప్పింద‌ని.. ఇప్పుడు అన్న‌ట్లుగానే సినిమా హిట్ కావ‌డంతో నందిని రెడ్డికి మ‌రో ఆఫ‌ర్ స‌మంత ఇచ్చేస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. పైగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థ ఇప్పుడు స‌మంత కోసం సిద్ధం చేస్తుంది నందిని. ఈ క‌థ‌ను నాగ‌చైత‌న్య‌తో క‌లిసి స‌మంత నిర్మించ‌బోతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి ఇన్ని రోజులు కేవ‌లం న‌ట‌న‌లోనే ఉన్న స‌మంత‌.. ఇప్పుడు నిర్మాత‌గా ఎలాంటి మాయ చేయ‌బోతుందో చూడాలి.

More Related Stories