కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన వరుణ్ ?

ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 వంటి వరుస విజయాలతో ఫాంలో ఉన్న వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరక్షన్ లో వాల్మీకి అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ కుర్ర హీరో గురించి మరో ఆసక్తికర అప్డేట్ వినిపిస్తోంది. నిజానికి గతేడాది ఉగాదికి అప్పట్లో ఒకడుండేవాడు ఫేం సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమా ఉంటుందని తన అభిమానులకు తెలిపారు. గతేడాది ఉగాది సదర్భంగా ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 14 రీల్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. అయితే ఆ సినిమా ఏమయిందో తెలీదు కానీ ఇప్పుడు అదే బ్యానర్ లో వాల్మీకి తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా పూర్తి అయ్యాక వరుణ్ తేజ్ కిరణ్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారని అంటున్నారు. తెలుగు ఫిలిం ట్రేడ్ గైడ్ తో ఓ తనకంటూ మంచి పేరు సంపాదించిన సీనియర్ జర్నలిస్ట్ తనయుడు కిరణ్ చాలా సినిమాలకు పలు దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పని చేసారు. ఆ అనుభవంతో మెగా హీరో వరుణ్ తేజ్ తో ఓ సినిమాను ప్లాన్ చేసాడు. దాదాపుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ , డిసెంబర్ లలో షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చే అవకాశాలున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలో దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.