English   

ప్రభాస్ నే నమ్ముకున్న సందీప్ !

Prabhas
2019-07-11 18:56:45

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా నిను వీడని నీడను నేనే రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ ఫంక్షన్ నిన్న రాత్రి జరిగింది. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా నిఖిల్ - సుధీర్ బాబు, అతిథులుగా కార్తికేయ - విష్వక్సేన్ లు హాజరయ్యారు. ఈ నలుగురికీ సినిమా సెకండ్ టికెట్ మొదలు వాళ్లకి సందీప్ కిషన్ అందజేశాడు. అయితే ఫస్టు టికెట్ మాత్రం ఏ హీరోకి ఇవ్వనున్నది ఈరోజు చెబుతానని అన్నాడు. దాంతో ఆయన ఆ టికెట్ ఎవరికీ ఇస్తాడో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆ ఆత్రుతని తెరదించుతూ కొంతసేపటి క్రితం సందీప్ కిషన్ తన సినిమా ఫస్టు టికెట్ ను ప్రభాస్ కి అందజేశాడు. ప్రసాద్ మల్టిప్లెక్స్ లో ప్రదర్శితం కానున్న ఈ సినిమా టికెట్ ను ప్రభాస్ కి అందజేస్తూ దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.   ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సిన్మా మీద ఆశలు పెట్టుకున్నాడు. అలాగే మొదటి టికెట్ ను డార్లింగ్ ప్రభాస్ కి ఇవ్వడం అనేది సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నాడు సందీప్.  చూడాలి మరి ఈ సినిమాతో అయిన హిట్ కొడతాడో లేదో ?
 

More Related Stories