English   

సందీప్ కిషన్ కి అలా షాకిచ్చారు !

 Sundeep Kishan
2019-07-11 19:09:30

మెట్రో అధికారులు హీరో సందీప్ కిషన్‌కు షాక్ ఇచ్చారు. అదేంటి సందీప్ కిషన్ కి వాళ్ళు ఎందుకు షాక్ ఇచ్చారు అనుకుంటున్నారా ? ఆయన హీరోగా నటిస్తున్న నిను నీడను వీడను నేనే సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సినిమా కధ మీద నమ్మకంతో ఆయనే స్వయంగా నిర్మించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ చాలా వినూత్నంగా చేస్తున్నాడు. గత వారంలో ఈ సినిమా పోస్టర్స్ ఐమాక్స్ టాయిలెట్స్ లో అంటించి రచ్చ రేపగా, మొన్నటికి మొన్న ప్రయదర్శి బండి కొట్టేసి రచ్చ రేపాడు. ఇక తాజాగా హైదరాబాద్‌లోని మెట్రో పిల్లర్లకి ప్రచార పోస్టర్లను ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అయితే సినిమా ఇంకో రోజు ఉందనంగా ఈ పోస్టర్లను మెట్రో అధికారులు తొలగించారు. పోస్టర్లలో హీరో, హీరో‌యిన్ను అసభ్యంగా చూపించారని ఉప్పల్‌కు చెందిన కొంతమంది ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ స్థానిక పోలీసులు, మెట్రో అదికారులు సహకారంతో మెట్రో పిల్లర్ల వెంట ఉన్న ఈ సినిమా పోస్టర్స్‌ను తొలిగించారు. దీంతో నిర్మాతలు ఈ ప్రచారం కోసమే మెట్రోతో పాటు జీహెచ్ఎంసీకి డబ్బులు కూడా చెల్లించామని, ఇప్పుడు ఇలా తీసేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

More Related Stories