English   

అమలా పాల్ మాజీ భర్త పెళ్లి...ఆ ట్వీట్ ఆయన గురించేనా ?

amala
2019-07-11 21:17:32

తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్, హీరోయిన్ అమలాపాల్ 2014లో ప్రేమించుకుని ఆ తర్వాత ఆ ప్రేమను వివాహ బంధంతో ముగించారు. ఆయిత అనతి కాలంలోనే వీరి వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అమలా పాల్ సినిమాల్లో నటించే విషయమై వారి మధ్య విభేదాలు తలెత్తి అదే వారి మధ్య విడాకులకి దారి తీసింది. విజయ్ నుంచి విడిపోయిన తర్వాత అమలాపాల్ హీరోయిన్ గా మళ్ళీ సినిమాలు మొదలుపెట్టింది. అమలాపాల్ నటించిన 'ఆమె' సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోన్న నేపధ్యంలో ఆమె మాజీ భర్తకి ఈరోజు వివాహం జరిగింది. ఇటీవలే విజయ్ తాను రెండో వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. డాక్టర్ ఐశ్వర్య అనే మహిళతో విజయ్ వివాహం ఈ రోజు చెన్నైలో జరిగింది. ఇక కొద్ది రోజుల క్రితం తన భర్త ఈ విషయాన్ని ప్రకటించిన నేపధ్యంలో అమలపాల్ చేసిన ఓ ట్వీట్ మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ట్వీట్ తన మాజీ భర్తని ఉద్దేశించే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ట్వీట్ లో ఏమి పేర్కొన్నారంటే "పోరాడతాను.. తట్టుకుని నిలబడతాను.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోను. నాపై నాకున్న నమ్మకమే నా బలం.. స్వేచ్ఛగా సంతోషంగా జీవించడం నాకు తెలుసు అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చివర్లో ఆమె చిత్రంలో తన పాత్ర ఇదే అంటూ అమలాపాల్ పేర్కొంది. సినిమా పేరు చెప్పి కవర్ చేసింది కానీ ఈ ట్వీట్ లో ఉన్న కామెంట్స్ మొత్తం తన మాజీ భర్త విజయ్ కు కౌంటర్ ఇచ్చినవే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More Related Stories