English   

విజయ్ డియర్ కామ్రేడ్ టీమ్ ని ఫ్రీగా కలవొచ్చంట

vijay
2019-07-11 21:29:26

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. ఈ సినిమాకి భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకక్కించారు, విజయ్ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాని ఒకేసారి నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ రోజు ఈసినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో పాటు నాలుగు బాషలలో రిలీజ్ చేయాల్సి ఉండడంతో ఈ సినిమా ప్రొమోషన్ ని వినూత్న రీతిలో చేయనుంది. మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రచారాన్ని చేయనుంది ఈ సినిమా యూనిట్. ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక‌ల్ ఫెస్ట్ నలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించ‌బోతున్నారు. ఈ నెల 12న బెంగుళూరులో, 13న కొచ్చిలో, 18న చెన్నైలో, 19న హైద‌రాబాద్‌లో మ్యూజిక‌ల్ ఫెస్టివ‌ల్ నిర్వహించ‌నున్నారు. సినిమా పూర్తయింది కాబట్టి ఇక ఎంజాయ్ చేయాల‌ని నిర్ణయించామని, అందుకే మంచి మ్యూజిక్‌ని ఆడియెన్స్‌తో క‌లిసి సెలబ్రేట్ చేయ‌బోతున్నామని చెప్పుకొచ్చాడు విజయ్. ఏ ప‌ని చేసినా, క‌ష్టసుఖాల్లో మ‌న‌కు తోడుగా ఉండే వ్యక్తుల్ని, స్నేహితుల‌ను కామ్రేడ్ అంటారని, తాను ఈ స్థాయిలో ఉండ‌టానికి కార‌ణం ఆడియెన్స్ అభిమానం, ప్రేమ‌, స‌పోర్ట్ అని వాళ్ళంతా తన కామ్రేడ్సే అని చెప్పుకొచ్చాడు. అందుకే వారికోసం మ్యూజిక్ సెలబ్రేష‌న్ నిర్వహించాలనుకుంటున్నామని అంద‌రూ ఫ్రీగా ఈ ఈవెంట్స్‌కి రావ‌చ్చని చెప్పుకొచ్చాడు. బెంగుళూరులో జ‌రిగే ఈవెంట్‌కి రాకింగ్ స్టార్ య‌శ్ గెస్ట్‌గా హాజ‌రు కానున్నారని చెప్పుకొచ్చాడు.

More Related Stories