దీనమ్మా కిక్కూ...ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ రివ్యూ !

చాలా కాలంగా హిట్స్ కోసం ఎదురు చూస్తున్న రామ్ పూరీతో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద రామ్ అలాగే పూరీ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 18 థియేటర్స్‌లోకి వస్తోంది. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ శంకర్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని టూరింగ్ టాకీస్, పూరి కనక్ట్ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మీద ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు ఈ సినిమా హీరో రామ్. తాజాగా ఈ విషయం మీద ట్వీట్ చేశాడు రామ్. ‘ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూశా.. దీనమ్మా కిక్కూ!! ఈ పాత్రను పోషిస్తున్నప్పుడు.. స్క్రీన్‌పై చూసుకున్నప్పడు వచ్చిన కిక్కే వేరప్పా.. ఇలాంటి కిక్ ఇచ్చిన సినిమా చేసి చాలా రోజులైంది. థాంక్స్ పూరీ జగన్నాథ్ గారూ.. మీరు డ్రగ్ అని చాలా మంది గ్రహించరు’.. అంటూ తన సినిమాకి మొదటి రివ్యూ ఇచ్చాడు రామ్. చూడాలి మరి రామ్ మాటలు ఎంతవరకూ నిజం అవుతాయో ?