English   

అమ్మకి అగ్రతాంబూలం ఇచ్చిన మెగా పవర్ స్టార్

Ram Charan
2019-07-12 12:11:58

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్ లో చేరిన సంగతి తెలిసిందే. ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే రోజుల వ్యవధిలోనే లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ మెగా హీరో ఈరోజు కొద్దిసేపటి క్రితమే తన తొలి పోస్ట్ ను తన ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. తన తల్లి సురేఖతో కలిసి దిగిన పిక్ ని రామ్ చరణ్ పోస్ట్ చేశాడు. చిన్నప్పుడు తల్లితో ఉన్న చిత్రాన్ని, ఆపై హీరోగా మారిన తరువాత తల్లితో ఒడిలో సేదదీరుతూ దిగిన చిత్రాన్ని కలిపి ఒక పిక్ గా ఎడిటింగ్ చేయించిన చరణ్ దానిని తన ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడవచ్చు. చిన్నప్పుడు తల్లి ఒడిలో సేద తీరినా, పెద్దయ్యాక తీరినా ఒకటేనని, కొన్ని విషయాలు ఎప్పటికీ మారవంటూ తన తల్లికి తన మీద, తనకు తల్లి మీద ఉన్న ప్రేమను ప్రతిబించేలా పోస్ట్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు మురిసిపోతున్నారు. తమ అభిమాన హీరో తన సినిమాలను ప్రమోట్ చేసుకోకుండా తన తల్లికి అగ్ర తాంబూలం ఇచ్చాడని చెబుతున్నారు. ఇక ఆయన ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఆయన సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది.   

More Related Stories