English   

విజయ్ దేవరకొండ తమ్ముడు, రాజశేఖర్ కూతురు...ఎంతవరకూ మెప్పిస్తారో ?

 Dorasani
2019-07-12 13:01:01

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ శేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతోన్న సినిమా దొరసాని. కేవీఆర్ మహేంద్ర అనే నూత దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ఈ సినిమాను సమర్పిస్తున్న ఈ సినిమాని మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆనంద్ విజయ్ దేవరకొండ తమ్ముడు కావడం, శివాత్మిక.. జీవిత, రాజశేఖర్ల కుమార్తె కావడంతో అందరి దృష్టి ఈ సినిమా మీదనే ఉంది. టీజర్ అంతగా ఆకట్టుకోక పోయినా ట్రైలర్ మాత్రం ఈ సినిమా మీద అంచనాలను పెంచింది. పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా సెట్‌లు, లొకేషన్లు, సహజసిద్ధమైన మేకప్ ఇవన్నీ ప్రతిబింబించేలా ట్రైలర్ కట్ చేయడంతో సినిమాపై జనాల్లో ఆసక్తి నెలకొని ఉంది. చూడాలి మరి ఈ ఇద్దరి సినీ జీవితానికి ఈ సినిమా ఏమేరకు నాంది పలుకుతుందో ?

More Related Stories