నటి మీద ఉబెర్ డ్రైవర్ లైంగిక వేధింపులు

ఈ మధ్య కాలంలో క్యాబ్ డ్రైవర్ లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం. క్యాబ్ కంపెనీలు దానిని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఎన్ని చెబుతున్నా ఈ ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే కలకత్తాలో చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాల్ టీవీ సీరియల్ నటి స్వస్తికా దత్తా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒక ఉబర్ డ్రైవర్ ఆమెను భయబ్రాంతులకి గురి చేశాడు. బెంగాలీ టీవీ నటి అయిన ఆమె పలు సక్సెస్ ఫుల్ సీరియల్స్ లో నటిస్తోంది. సీరియల్ షూటింగ్‌కు వెళ్లడానికి మొన్న ఉదయం స్వస్తికా ఉబెర్ క్యాబ్ బుక్ చేశారు. కారు వచ్చాక కారులో షూటింగ్ స్పాట్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ బుకింగ్‌ను క్యాన్సిల్ చేసి, ఆమెను బయటికి లాగాలని ప్రయత్నించాడు. స్వస్తికా దత్తా ప్రతిఘటించడంతో ఆమెను అక్కడ బయటకి లాక్కేళ్ళడం కష్టం అని భావించి కారులోనే మరో చోటికి తీసుకెళ్లడానికి యత్నించి, కార్ లాక్ చేసి ఫోన్లో తన ఫ్రెండ్స్‌ని కూడా ఫలానా చోటకి రమ్మన్నాడు. ఎలాగోలా తలుపు తెరుచుకున్న నటి కారు నుండి దూకి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ కారుతో సహా పారిపోయాడు. ఈ తతంగాన్ని అంతా తన ఫేస్ బుక్ లో పేర్కొన్న నటి, ఆ తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఇక ఈ విషయం మీద స్పందించిన పోలీసులు డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఆ డ్రైవర్ తో ఒప్ప్దందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు కూడా ప్రకటించింది ఉబెర్ సంస్థ.