వికటించిన ఆపరేషన్...పోసానికి మళ్ళీ అస్వస్థత

ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. అయినా ఏపీ ఎన్నికలు కీలకం కావడంతో ఆయన వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ పార్టీ తరపున మీడియాలో బలమైన వాయిస్ కూడా వినిపించారు. కానీ ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించి ఆపరేషన్ కూడా చేశారు. వైసీపీ గెలుపు తర్వాత వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వచ్చి ఆయన్ను పరామర్శించారు. ఆయన గుడులకి కూడా తిరిగి జగన్ గెలిచినందుకు మొక్కులు కూడా తీర్చుకోవడంతో ఆయన ఆరోగ్యమంతా బాగాయినట్టే అని అనుకున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆయన చేయించుకున్న ఆపరేషన్ వికటించినట్టు తెలుస్తోంది. నిజానికి ఆయనకీ చేసింది హెర్నియా ఆపరేషన్, రెస్ట్ తీసుకోలేదో ఏమో కానీ ఆయనకు ఆపరేషన్ జరిగిన చోట ఇన్ఫెక్షన్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇక తప్పక పోసాని మరోసారి హాస్పటల్లో జాయిన్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం పోసాని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మరోసారి ఆపరేషన్ చేసి ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని అంటున్నారు. ఈ విషయం మీద పూర్తి వివరాలు అందాల్సి ఉంది.