English   

విజయ్ దేవరకొండ బాటలో నడుస్తున్న పూరీ !

Puri Jagannadh
2019-07-12 15:31:05

 

తెలుగు సినిమాలో తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు పూరీ, త్వరలోనే మరో వ్యాపారం ప్రారంభిస్తున్నాడట. ఇప్పటికే సినీ నిర్మాణంలోకి దిగి సినిమాలు నిర్మిస్తున్న పూరీ ఇప్పుడు తాను మరో బిజినెస్ లోకి అడుగుపెడుతున్నానని ప్రకటించారు ఆయన. అది కూడా ఒక్కరే కాదు తన  వ్యాపార భాగస్వామి అయిన చార్మీతో. పూరి జగన్నాథ్‌, ఛార్మీలు ఇప్పటికే వ్యాపార భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. పూరీ కనెక్ట్స్ పేరుతో ఇప్పటికే ఓ సంస్థను వీరిద్దరూ కలసి నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా వీరు సినిమాలు చేస్తున్నారు. అమ్న్తేకాక పూరిజగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ పూరిటూరింగ్ టాకీస్ పనులను కూడా ఛార్మీనే చూసుకుంటోంది. తాజాగా వీరిద్దరూ కలిసి మగవారి బట్టలను ఆన్‌లైన్లో అమ్మే బిజినెస్ మొదలుపెడుతున్నారు. అంటే ఆన్లైన్ బట్టల బిజెనెస్ అన్నమాట. దీనికోసం ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించబోతున్నారట. అయితే ముందుగా ఆర్డర్ చేసిన కొంతమందికి వారికి 30శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుందట. నిన్న జరిగిన ఈ సినిమా ఫంక్షన్‌లో ఈ బట్టల డిజైన్లను ఒక వీడియో రూపంలో చూపించారు. ఇప్పటికే ఈ బిజినెస్ లో రౌడీ పేరుతో విజయ్ దేవరకొండ ఉండగా, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే బ్రాండ్ కూడా ఉంది. ఇప్పుడు వారి బాటలోనే నడుస్తున్నారు పూరీ.

More Related Stories