English   

కార్తికేయ సినిమా వాయిదా తప్పదా ?

guna
2019-07-12 20:31:15

ఆర్ఎక్స్ 100 సినిమాతో  హిట్ కొట్టి యూత్ లో క్రేజ్ సంపాదించిన కార్తికేయ, మొన్ననే హిప్పీ అనే సినిమా రిలీజ్ చేశారు. అయితే ఈ హిప్పీ సినిమా  బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవడంతో నిర్మాతలు కూడా భారీగా నష్టపోయారు. అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడంతో నిర్మాతలు నష్టాల బాట పట్టారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో వచ్చిన క్రేజ్ హిప్పీ సినిమాతో పడిపోయింది. ప్రస్తుతం కార్తికేయ బోయపాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో 'గుణ 369' అనే సినిమాతో లక్ చెక్ చేసుకోనున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. ఈ టీజర్ సినిమా మీద అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాలో కార్తికేయని హ్యాండ్సమ్ గా, వయలెంట్ గా , లవర్ బాయ్ గా ఇలా పలు విభిన్న యాంగిల్స్ లో కనిపించాడు. ఇక ఈ సినిమాని వచ్చేనెల 2న విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాకి కూడా నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. బిజినెస్ బాగా జరుగుతుందని ఆశించగా హిప్పీ సినిమా ఎఫెక్ట్ గుణ 369 సినిమాపై పడిందని తెలుస్తోంది. గుణ 369 సినిమా కొనడానికి బయ్యర్లు ముందుకు రావటం లేదని సమాచారం. అందుకే ఈ  సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా ద్వారా మలయాళ భామ అనఘ తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ సినిమాని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాల సంయుక్తంగా నిర్మించారు. ఆరెక్స్ 100 సినిమా ఫేం చేతన్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందించారు. 

More Related Stories