English   

అలీకి కీలక పదవి కట్టబెట్టనున్న జగన్ ?

Comedian Ali
2019-07-13 09:22:32

గత ఎన్నికల ముంగిట మొదలుపెట్టిన ప్రముఖ హాస్య నటుడు అలీ రాజకీయ టూర్‌ ఎట్టకేలకు లోటస్‌పాండ్‌ వద్ద ముగిసిన సంగతి తెల్సిందే. అంతకు ముందు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో, తనకు అత్యంత సన్నిహితుడు అయిన జనసేన అధినేత పవన్ తో కూడా చర్చలు జరపడంతో ఆయన చేరిక విషయం మీద కాస్త సందిగ్థత నడిచినా ఆయన మ‌ళ్లీ జ‌గ‌న్ వైపే వ‌చ్చి బేషరతుగా పార్టీలో చేరారు. అప్పట్లో పార్టీలో స‌ముచిత స్థానం ఇవ్వ‌డంతో పాటు ఎమ్మెల్సీ కూడా ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు ప్రచారం జరిగింది. ఇక ఇదే విషయాన్ని తాజాగా అలీ జగన్ సన్నిహితుల దృష్టికి తీసుకేల్లినట్టు చెబుతున్నారు. తనకు జగన్ అప్పుడు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారని ఆ సంగతి ఏదో చూడండి అంటూ సంకేతాలు పంపారట. ఈ విషయం మీద జగన్ కూడా సానుకూలంగానే ఉన్నారని, త్వరలోనే అలీని ఎమ్మెల్సీని చేయచ్చని అంటున్నారు. నిజానికి మంత్రి అవ్వడమే ధ్యేయం అని చెప్పిన అలీ అప్పట్లో ఎటువంటు షరతులు లేకుండా జగన్ గూటికి చేరడం మీద పెద్ద చర్చే నడిచింది. అయితే మంత్రిని చేసే పార్టీలోనే ఇదివరకు చేరతానని ప్రకటించిన విషయాన్ని ఒక మీడియా ప్రతినిది అలీ పార్టీలో చేరిన సందర్భంలో అడుగగా ఇప్పటికీ అదే మాట మీద ఉన్నానని అలీ అన్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ ఆయనకు ఎమ్మెల్సీ ని చేసి తద్వారా మంత్రిని చేస్తారేమో చూడాలి మరి. ఎందుకంటే ప్రస్తుత మంత్రుల పదవీ కాలం రెండున్నరేళ్ళు మాత్రమే కదా.

More Related Stories