పహిల్వాన్ గా మెరిపించనున్న కిచ్చ సుదీప్

ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్ నటిస్తోన్న తాజా సినిమా పహిల్వాన్. కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమాని వారాహి చలన చిత్రం బ్యానర్ తెలుగులో రిలీజ్ చేయనుంది. కన్నడ నాట ఎస్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో సుదీప్ రెజ్లర్ పాత్రలో కనిపించనున్నారు. కన్నడలో పైల్వాన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మాత్రం పహిల్వాన్ పేరుతో తెరక్కనుంది. ఇక ఈ సినిమాని ఆగస్ట్ 29న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. నిజానికి ఒకప్పుడు కన్నడ సినిమాలు వేరే బాషలలో డబ్ అయ్యేవి కావు కానీ, కేజీఎఫ్ దెబ్బకి ఈ సినిమాలలో కూడా విషయం ఉందని ప్రపంచానికి అర్ధం అయ్యింది. మరో విశేషం ఏంటంటే కేజీఎఫ్ సినిమాని తెలుగులో అనువదించిన వారాహి సంస్థే ఈ సినిమాని కూడా డబ్ చేసింది. ఇక ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన పహిల్వాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అర్జున్ జన్యా సంగీతం అందించిన ఈ సినిమాకు కరుణాకర్ సినిమాటోగ్రఫీ అందించారు.