English   

రేణు దేశాయ్ రీ ఎంట్రీ...కన్ఫాం చేసిన రైటర్ !

Renu desai
2019-07-13 12:14:37

మరాఠీ నుండి తెలుగు సినిమాల్లోకి వచ్చిన రేణు పవన్ సరసన బద్రీ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయినా తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్‌తో పెళ్లి కారణంగా ఆమె తెలుగు వారందరికీ సుపరిచితం అయిపోయారు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టాక ఏవో కారణాల వలన పవన్ నుండి విడాకులు తీసుకున్న రేణు అ తర్వాత నటన వైపు వెళ్లలేదు. అయితే ఆమె ఆ తరువాత దర్శక నిర్మాతగా తన అభిరుచికి తగిన డాక్యుమెంటరీ టైప్ సినిమాలను మరాఠీలో చేస్తూ వచ్చారు. అలాంటి రేణుదేశాయ్ తెలుగులో ఒక సినిమాలో కీలకమైన పాత్రను చేయడానికి అంగీకరించినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు వంశీకృష్ణ ఒక బయోపిక్ చేస్తున్నారని విషయం తెలిసిందే. ఇది 'స్టూవర్ట్పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్. అయితే ఈ సినిమాలో హీరోకి అక్క పాత్రలో రేణు దేశాయ్ నటించనున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇది ఇప్పటిదాకా ప్రచారానికే పరిమితం కాగా ఆ విషయం మీద ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎలా అంటే టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కి మాటలు రాస్తున్న సాయి మాధవ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాలో రేణు దేశాయ్ ని ఒక పాత్ర కోసం సంప్రదించినట్టు క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే ఆ విషయమై అఫీషియల్ ప్రకటన విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన ఈ విషయం ద్వారా రేణు దేశాయ్ సినిమాల్లోకి అదేనండీ నటనలోకి మళ్ళీ తిరిగొచ్చినట్లే అని చెప్పాలి.
 

More Related Stories