శ్రీ దేవి హత్య వ్యాఖ్యల మీద విరుచుకుపడ్డ బోనీ !

అతిలోక సుందరి శ్రీదేవి ఒక పెళ్లి కోసమని దుబాయ్ వెళ్లి అక్కటి హోటల్ లోని బాత్ టబ్‌లో పడి మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై ఇప్పటికి పలు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నా, రీసెంట్గా కేరళకి చెందిన జైళ్ళ శాఖ మాజీ డీజీపీ రిషి రాజ్ సింగ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆమె ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోలేదని, హత్య చేయబడిందని చెప్పారు ఆయన. అలాగే ఈ మాటలు ఊరికే అనడం లేదని తన స్నేహితుడయిన ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతన్ ఈ విషయం గురించి చెప్పిన విషయాలను బట్టి అలా అంటున్నానని ఆయన ఒక మలయాళీ పత్రికలో వ్యాసం రాశారు. కొన్ని కీలక ఆధారాలని బేరీజు వేస్తే ఆమెది యాక్సిడెంటల్ డెత్ కాదని కావాలనే ఎవరో మర్డర్ చేసారని క్లియర్‌గా అర్ధమవుతుందని ఆయన కధనంలో రాజ్‌సింగ్ పేర్కొన్నారు. అయితే ఈ విషయం వైరల్ కావడంతో బాలీవుడ్ మీడియా కూడా కధనాలు ప్రసారం చేసింది. కొన్ని మీడియా సంస్థలు ఆయన్ని కదిపే ప్రయత్నం చేయగా ఆయన ఘాటుగా స్పందించారు. ఇలాంటి చెత్త స్టోరీలు తాను పట్టించుకోనని చెప్పిన ఆయన, ఆధారాలు లేని ఊహాజనిత స్టోరీలకి తాను స్పందించాల్సిన అవసరమే లేదని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఆమె మృతి చెందిన సమయంలో బోనీ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. కానీ దుబాయ్ పోలీసుల దర్యాప్తులో ఆమెది సహజ మరణం అని తేలడంతో ఆరోపణలు చేసిన వారు సైలెంట్ అయ్యారు.