డబ్బు కోసమే నన్ను ఇరికిస్తున్నారంటున్న సోనాక్షి సిన్హా..

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కొన్ని రోజులుగా కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఆమెపై ఓ ఛీటింగ్ కేస్ కూడా నమోదైంది. ఓ ఈవెంట్లో పర్ఫార్మెన్స్ చేస్తానని ఒప్పుకుని ఆ తర్వాత రాకుండా తమను మోసం చేసిందని.. అంతే కాకుండా తీసుకున్న 24 లక్షలు కూడా ఇప్పటికీ తిరిగివ్వడం లేదని ఆమెపై కేస్ పెట్టాడు. డబ్బు తీసుకున్నాక కూడా ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని చెబుతున్నాడు ఆ మేనేజర్. దీనిపై ఇప్పుడు ఈ బ్యూటీ కూడా స్పందించింది. అసలు తనను కావాలనే డబ్బులు గుంజడానికి ఈ కేసులో ఇరికిస్తున్నారని చెబుతుంది. ఈమెపై ఇప్పుడు ఢిల్లీ మొరాదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో మొరాదాబాద్ పోలీసులు కూడా సోనాక్షి ఇష్యూను సీరియస్ గా తీసుకుని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సోనాక్షి ఇంటికి కూడా వచ్చి సోదాలు నిర్వహించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. ఆ సమయంలో సోనాక్షి ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయారు పోలీసులు. ఈ విషయంపై సోనాక్షి స్పందిస్తూ.. తన పని తాను సరిగ్గా చేయకుండా ఇప్పుడు తిరిగి తనపైనే తప్పు వేస్తున్న ఈవెంట్ మేనేజర్ ను ఏమనాలి అంటూ సీరియస్ అయింది సోనాక్షి. తనను ఈ కేసులో ఇరికించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు.. కానీ అతడికి తెలియదు ఇప్పటి వరకు తనపై చిన్న మచ్చ కూడా లేదని అంటూ ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మూర్ఖుల మాటలు అస్సలు నమ్మొద్దంటూ ట్వీట్ చేసింది సోనాక్షి. మరి ఈ కేస్ ఎక్కడికి వెళ్తుందో చూడాలి.