English   

దొర‌సానిపై విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌శంస‌లు.. కానీ బ‌య‌ట మాత్రం..

Vijay Devarakonda
2019-07-13 15:25:55

దొర‌సాని సినిమా విడుద‌లైంది.. ఈ చిత్రంతో విజ‌య్ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. కొత్త ద‌ర్శ‌కుడు కేవీఆర్ మ‌హేంద్ర తెర‌కెక్కించిన ఈ సినిమాకు టాక్ చాలా దారుణంగా వ‌చ్చింది. అస‌లు ఇంత స్లో సినిమా ఈ మ‌ధ్య కాలంలో రాలేదంటూ పెద‌వి విరుస్తున్నారు ప్రేక్ష‌కులు. కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం త‌న త‌మ్ముడు సినిమాకు ప్రమోష‌న్ మొద‌లు పెట్టాడు. ముందు నుంచి ఈ చిత్రం విష‌యంలో చాలా దూరంగా ఉంటూ వ‌చ్చిన ఈ కుర్ర హీరో ఇప్పుడు మాత్రం రెచ్చిపోతున్నాడు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచే త‌మ్ముడి సినిమాను భుజాన వేసుకున్నాడు. ప్రీ రిలీజ్ వేడుక‌లో సినిమా అద్భుతం అంటూ పొగిడిన విజ‌య్.. ఇప్పుడు విడుద‌లైన త‌ర్వాత కూడా ఒక్కొక్క‌రి ప‌ర్ఫార్మెన్స్ గురించి ట్వీట్ చేసాడు. మై బాయ్ ఐ ల‌వ్ యూ సో మ‌చ్ అంటూ త‌మ్ముడికి శుభాకాంక్ష‌లు తెలిపిన విజ‌య్.. శివాత్మిక‌ను కూడా ఆకాశానికి ఎత్తేసాడు. ఇక ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర‌, సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ విహారిపై కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. మీరంతా క‌లిసి ఓ అద్భుతానికి ప్రాణం పోసారంటున్నాడు. ఇదిలా ఉంటే బ‌య‌ట మాత్రం సినిమాపై దారుణంగా కామెంట్స్ వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో త‌న ఇమేజ్ కూడా ప‌ణంగా పెట్టి త‌మ్ముడి సినిమాను కాపాడ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మ‌రి ఈయ‌న ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి. ఈయ‌న ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జులై 26న విడుద‌ల కానుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన  ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. 

More Related Stories